Samsung Galaxy M06: సూపర్ ఫీచర్లతో "శామ్సంగ్ గెలాక్సీ M06"..రూ.10 వేల కంటే తక్కువ ధరకే.! 3 d ago

స్మార్ట్‌ఫోన్ రంగంలో దిగ్గజం అయిన శాంసంగ్ తన గెలాక్సీ M సిరీస్‌తో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గొప్ప ప్రదర్శన చూపుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా Samsung Galaxy M06 అనే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో 5G కనెక్టివిటీ, పెద్ద బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 వంటి లేటెస్ట్ ఫీచర్లను అందిస్తూ ఈ ఫోన్ బడ్జెట్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఇస్తున్న అద్భుతమైనగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను చూద్దాం రండి.
Galaxy M06 ఫీచర్లు:
ప్రాసెసర్: MediaTek Dimensity 6300
డిస్‌ప్లే: 6.7-అంగుళాల PLS LCD
రిఫ్రెష్ రేట్: 90Hz
పీక్ బ్రైట్‌నెస్: 800 nits
బ్యాటరీ: 5000mAh
ఛార్జింగ్: 25W ఫాస్ట్ ఛార్జింగ్
1.5TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
బ్యాక్ కెమెరా: 50MP + 2MP
ఫ్రంట్ కెమెరా: 8MP
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 OS, శాంసంగ్ వన్ UI
వేరియంట్స్:
- 4GB RAM + 128GB స్టోరేజ్
- 6GB RAM + 128GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.3
- 3.5mm ఆడియో జాక్
- Wi-Fi 5 --- 5GHz
- 5G, 4G డ్యూయల్ సిమ్ స్లాట్ (హైబ్రిడ్)
- GPS with A-GPS
ఫోన్ రంగులు:
- సేజ్ గ్రీన్
- బ్లెజింగ్ బ్లాక్
లోపాలు:
ఈ ఫోన్ లో కెమెరా తక్కువనే చెప్పాలి. MediaTek ప్రాసెసర్ కావడం వల్ల గేమింగ్ అనుభవాన్ని పెద్దగా కల్పించదు. తక్కువ రిజల్యూషన్ డిస్‌ప్లే, పాత వై-ఫై, NFC లేకపోవడం వంటి లోపాలు ఉన్నాయి.
ఈ ఫోన్ లో కొన్ని లోపాలు ఉన్నపటికీ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో మొబైల్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.10 వేల నుండి ప్రారంభం. మంచి డిస్‌ప్లే, ఆధునిక కనెక్టివిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్ తో మార్కెట్లో ఈ ఫోన్ మంచి పోటీ ఇస్తుంది. రోజువారీ ఉపయోగానికి ఈ ఫోన్ చాలా బాగుంటుంది.
ఇది చదవండి: ఎక్కువ ఫీచర్లు.. ధర కేవలం రూ. 6,499 మాత్రమే.!